Find Articles

హీరో నుంచి నిర్మాతగా.. అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణం

హీరో నుంచి నిర్మాతగా.. అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణం

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత 2’ కు నిర్మాతగా వ్యవహారించనున్నారు.ఈ సిరీస్‌తో తాను నిర్మాతగా మారుతున్న విషయాన్ని నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “దూత రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందుకు సాగడమే. అద్భుతాలు జరగబోతున్నాయి” అంటూ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.

నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే అంచనా వేస్తున్న న్యూస్‌పేపర్ల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో ఆయన నటన ప్రతిఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ రెండో భాగం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్, అక్కినేని నాగార్జున హాజరయ్యారు.ఈ సందర్భంగా తొలి షాట్‌కు క్లాప్‌ కొట్టిన ఆయన యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ManaTV Team