
కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన బిహైండ్ -ది -సీన్స్ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ బీటీఎస్ వీడియోలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నారో చూపించారు. భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ చేసే సమయంలో ఆమె కమాండింగ్ ప్రెజెన్స్ తో పాటు నటీనటులను, సిబ్బందిని కచ్చితత్వంతో నడిపిస్తున్న విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.ఈ వీడియోతో పాటు ‘ ప్రతి షాట్ స్పెషల్ గా ఉండటం వెనుక, సంభాషణల కన్నా మౌనమే ఎక్కువ చెప్పడం వెనుక ఆమె ఉన్నారు. హ్యాపీ బర్త్ డే గీతూ మోహన్ దాస్ ’ అంటూ చిత్ర యూనిట్ ఒక సందేశాన్ని కూడా జోడించింది.
భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు డైరెక్ట్ చేయడం చాలా అరుదు.దీంతో గీతూ మోహన్ దాస్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.టాక్సిక్- ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పేరుతో వస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే ‘సినిమాకాన్’ ఈవెంట్లో ఈ చిత్రానికి గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు వీలుగా రిలీజ్ డేట్ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

