Find Articles

TTA Mega Convention : అమెరికాలో అతిపెద్ద తెలుగు సంబరం.. దేవి శ్రీ ప్రసాద్, దిల్ రాజు లైవ్ ఎంట్రీ!

TTA Mega Convention : అమెరికాలో అతిపెద్ద తెలుగు సంబరం.. దేవి శ్రీ ప్రసాద్, దిల్ రాజు లైవ్ ఎంట్రీ!

అమెరికా (షార్లెట్): ప్రవాస తెలుగు సమాజం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న “తెలంగాణ తెలుగు అసోసియేషన్” (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ జూలైలో జరగబోయే ఈ మహాసభల్లో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తన మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన రాక్‌స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP), టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు.

అమెరికాలోని నార్త్ కరోలినాలో గల షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ ఈ చారిత్రాత్మక వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ అతిపెద్ద తెలుగు సంబరంలో భాగం కావడానికి, లైవ్ హంగామాను కళ్లారా వీక్షించడానికి నిర్వాహకులు రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు.

వేదిక మరియు తేదీల వివరాలు:

వేదిక: షార్లెట్ కన్వెన్షన్ సెంటర్, షార్లెట్, NC (Charlotte Convention Center)

తేదీలు: జూలై 17, 18, 19 (2026)

టికెట్ బుకింగ్స్ కోసం: అధికారిక వెబ్‌సైట్ www.ttaconvention.org/registration ద్వారా మీ సీట్లను ఇప్పుడే రిజర్వ్ చేసుకోవచ్చు.

ప్రవాస తెలుగు వారంతా ఈ మెగా వేడుకలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీటీఏ ప్రతినిధులు కోరుతున్నారు.

 

ManaTV Team