Find Articles

పాలిటిక్స్ లోకి ధనుష్.? వైరల్ గా ఫ్యాన్స్ క్లబ్ జెండా

పాలిటిక్స్ లోకి ధనుష్.? వైరల్ గా ఫ్యాన్స్ క్లబ్ జెండా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన అభిమాన సంఘం ఆవిష్కరించిన అధికారిక జెండా. దీంతో తమిళ రాజకీయాల్లోకి ధనుష్ అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అభిమాన సంఘం ఆవిష్కరించిన జెండాలో ధనుష్ చేతులు జోడించి, నమస్కరిస్తున్న పోజ్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరుపు, తెలుపు రంగులతో డిజైన్ చేసిన ఫ్లాగ్… రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉంది. దీంతో ప్రతి ఒక్కరి చూపు దానిపైనే పడింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు మాత్రమే కాదు… రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ హడావిడి ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. దీనిపై అటు ధనుష్ గానీ, ఇటు ఆయన పీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా? లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిల్ చేయాల్సిందే. ఏదీఏమైనప్పటికీ, తమిళ పాలిటిక్స్ లో ఈ ‘జెండా’ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ManaTV Team