Find Articles

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ పై కాసుల వర్షం.. టీమిండియాకు ఎంతంటే.?

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ పై కాసుల వర్షం.. టీమిండియాకు ఎంతంటే.?

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం విన్నర్ మాత్రమే కాదు.. ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్ కూడా భారీ మొత్తాన్ని అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ మెగా టోర్నీ కోసం కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది.

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో రికార్డు స్థాయిలో ఏడోసారి వరల్డ్ కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో బెత్ మూనీ, ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ మధ్య జరిగిన సెంచరీ పార్ట్‌నర్‌షిప్ టీమ్ విజయానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. అలాగే, ఆస్ట్రేలియాకు టైటిల్ అందించడంలో ఓపెనర్ బెత్ మూనీ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 64 రన్స్ చేసింది. దీంతో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కింది. బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ 5 క్యాచ్‌లు పట్టి ఔరా అనిపించుకుంది.

ఆస్ట్రేలియా టీమ్‌కు ఐసీసీ భారీ నజరానా ఇచ్చింది. ఛాంపియన్‌గా నిలిచిన ఈ టీమ్ కు ట్రోఫీతో పాటు ఏకంగా 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 22 కోట్ల భారీ ప్రైజ్ మనీని అందించింది. అలాగే ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్‌కు 1.17 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే దాదాపు రూ. 11 కోట్ల భారీ అమౌంట్ అందించింది. ఇక సెమీఫైనల్స్ వరకు వచ్చి ఓటమి పాలైన వెస్టిండీస్, సౌతాఫ్రికా టీమ్స్‌కు సమానంగా ప్రైజ్ మనీ లభించింది. ఈ రెండు జట్లకు 6.7 లక్షల యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 6.29 కోట్ల చొప్పున ఐసీసీ అందజేసింది.

అంతేకాదు, ఈ టోర్నీలో నాకౌట్ స్టేజ్‌కు చేరుకోలేకపోయిన మిగిలిన 8 టీమ్స్‌కు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ ఇచ్చింది. ఇందులో ప్రతి టీమ్‌కు రూ. 2.35 కోట్లు లభించాయి. లీగ్ స్టేజ్ దాటలేకపోయిన టీమ్ ఇండియా కూడా ఈ రూ. 2.35 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది..అదేవిధంగా గ్రూప్ స్టేజ్‌లో సాధించిన ప్రతి గెలుపుకు ఆయా టీమ్స్‌కు అదనంగా 31,154 యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 29 లక్షల చొప్పున ఐసీసీ బోనస్ మనీ అందించింది.

ManaTV Team