Find Articles

ఇంజిన్‌లో సమస్య.. గోవాకు తిరిగొచ్చిన ఇండిగో విమానం

ఇంజిన్‌లో సమస్య.. గోవాకు తిరిగొచ్చిన ఇండిగో విమానం

గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం 6E 2102లో ఇంజిన్‌కు సంబంధించిన సమస్య తలెత్తడంతో విమానాన్ని తిరిగి గోవాకు మళ్లించారు. మంగళవారం ఉదయం 9:16 గంటలకు టేకాఫ్ అయిన విమానంలో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు.

సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని సురక్షితంగా గోవా వైపు మళ్లించి, ఉదయం 9:51 గంటలకు గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి దించి, వారి కోసం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేశారు.

ఇక ఈ విమానాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం.

ManaTV Team