సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని, ప్రజల ఆశీస్సులతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ వచ్చానని, తనకు ప్రజాబలం ఉందని అన్నారు.
ఎన్నికల టికెట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్నారు.