ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ప్రమోషన్లతో చిత్రబృందం ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తోంది. ఇప్పటివరకు సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ప్రధాన తారాగణం ఈసారి ఆధునిక క్యాజువల్ దుస్తుల్లో మెరిసి అభిమానులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో నటి సాయిపల్లవి, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, కన్నడ స్టార్ యష్ తమ ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ కూడా ఈ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుమారు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసం రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
లండన్‌లో చిత్రబృందం సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.