అమెరికా తెలుగు సంఘం (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. ఈ మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్తో పాటు మేరీల్యాండ్ మరియు వర్జీనియా రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మరో విశేషం ఏమిటంటే.. మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హైదరాబాద్‌లో జన్మించారు. దీంతో అమెరికా–తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక బంధాలకు ఈ మహాసభలు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.
జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో జరిగే ఈ మహాసభల్లో వేలాది మంది తెలుగు ప్రజలు పాల్గొననున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా వేదికలు, సాహిత్య సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రముఖులతో స్ఫూర్తిదాయక సంభాషణలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు వంటి అనేక విశేషాలు ఉండనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ చారిత్రాత్మక మహాసభల్లో పాల్గొనాలని ATA నిర్వాహకులు కోరుతున్నారు. నమోదు కోసం www.ataconference.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…
Tirupati Balaji Latest Information | Tirumala Update తిరుమల సమాచారం#tirumala #ttd#balaji#manatvlive #tirumala #ttd #tirupati #tirupatibalaji #srivari…
#harishrao #congress #telangana #telanganapolitics #brs #politics #breakingnews #latestnews #manatvlive #telugunewsWatch Mana TV Anytime, Anywhere! Mana…