హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్’ చుట్టూ వివాదం చెలరేగింది. ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం స్పోర్ట్స్ అండ్ సినీ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హెచ్‌సీఏ ఈ టీజీ20 లీగ్‌ను అక్రమంగా నిర్వహిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. బోర్డు పర్మీషన్ లేని లీగ్‌ను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం చట్టప్రకారం తప్పని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ లీగ్ పేరు వాడుకుంటూ కార్పొరేట్ కంపెనీలతో హెచ్‌సీఏ రూ. వందల కోట్ల బిజినెస్ చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేస్తూ సాగుతున్న ఈ లీగ్ ప్రమోషన్లపై ప్రముఖులు వెంటనే పునరాలోచన చేయాలని సూచించింది. లేనిపక్షంలో చట్టపరంగా న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీసీఏ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…