వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో ముఖ్యాంశాలు
• సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానమవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక.
• భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును నేను గౌరవిస్తాను… మా ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు, చట్టపరమైన పరిణామాలు తప్పవు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి.
• సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టూ అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకు ఉంది. అదే ప్రజాస్వామ్యం… దాన్ని మేము స్వాగతిస్తాము
• కానీ ఒకరిని తిట్టడం, ప్రాణ భయానికి గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం… ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు.
• గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనుక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు, ఫోటోలను అసభ్యంగా మార్చడం, వేధింపులు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలను అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తున్నారు.
• దేవుళ్లు, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఆరోగ్యకరమైన విమర్శ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతం అంతకంటే కాదు.
• నిర్మాణాత్మక విమర్శలు, ఫెయిర్ కామెంట్స్, సెటైర్స్ , విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాము.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…
Tirupati Balaji Latest Information | Tirumala Update తిరుమల సమాచారం#tirumala #ttd#balaji#manatvlive #tirumala #ttd #tirupati #tirupatibalaji #srivari…
#harishrao #congress #telangana #telanganapolitics #brs #politics #breakingnews #latestnews #manatvlive #telugunewsWatch Mana TV Anytime, Anywhere! Mana…