అమెరికా (షార్లెట్): ప్రవాస తెలుగు సమాజం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న “తెలంగాణ తెలుగు అసోసియేషన్” (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ జూలైలో జరగబోయే ఈ మహాసభల్లో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తన మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన రాక్‌స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP), టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో గల షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ ఈ చారిత్రాత్మక వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ అతిపెద్ద తెలుగు సంబరంలో భాగం కావడానికి, లైవ్ హంగామాను కళ్లారా వీక్షించడానికి నిర్వాహకులు రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు.
వేదిక మరియు తేదీల వివరాలు:
వేదిక: షార్లెట్ కన్వెన్షన్ సెంటర్, షార్లెట్, NC (Charlotte Convention Center)
తేదీలు: జూలై 17, 18, 19 (2026)
టికెట్ బుకింగ్స్ కోసం: అధికారిక వెబ్‌సైట్ www.ttaconvention.org/registration ద్వారా మీ సీట్లను ఇప్పుడే రిజర్వ్ చేసుకోవచ్చు.
ప్రవాస తెలుగు వారంతా ఈ మెగా వేడుకలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీటీఏ ప్రతినిధులు కోరుతున్నారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…