Rajasthan Royals' Vaibhav Suryavanshi gestures at the end of the Indian Premier League (IPL) Twenty20 cricket match between Rajasthan Royals and Gujarat Titans at the Sawai Mansingh Stadium in Jaipur on April 28, 2025. (Photo by Sajjad HUSSAIN / AFP) / -- IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE --
బీసీసీఐ 2026 ఆసియా గేమ్స్ కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్ జాబితాను సిద్ధం చేసింది. ఈ మేరకు లిస్టును ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు సమర్పించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.ఈ ఆసియా గేమ్స్ లో ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. కానీ టీమ్ ఇండియా టీ20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ పేర్లను చేర్చలేదు.వెస్టిండీస్ సిరీస్ తో పాటు 2028 ఒలింపిక్స్ గేమ్స్, టీ 20 వరల్డ్ కప్ సన్నద్ధత నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ను సెలెక్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇక శుభ్ మన్ గిల్ కూడా స్వదేశంలో వన్డేలకు సారథ్య బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది.
ఈ జాబితాలో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, తుది జట్టులో అతడిని సెలెక్ట్ చేస్తారా.? లేదా.?అనే దానిపై క్లారిటీ లేదు.అయితే ఆసియా గేమ్స్ లో ఆడే టీమిండియా కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. స్పిన్నర్లలో అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, హర్ష్ దూబే, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది. కానీ తుది జట్టులో మాత్రం వీరిలో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది.
బీసీసీఐ అందించిన 30 మంది ప్లేయర్స్ లిస్టు..
వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, అనుకుల్ రాయ్, హర్ష్ దుబె, ధ్రువ్ జురెల్, రుతరాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, శివమ్ దుబె, విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…