టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించారు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో లక్నో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా మరో మైలురాయిని అందుకోవడం విశేషం. లిస్ట్ ఏ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా ఆయన నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయగా.. ఫైనల్ టీమ్ లోకి కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ వచ్చారు.
ఇక, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ 30 ఓవర్లు ముగిసేరికి 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే శుభారంభం చేసిన భారత్.. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించించిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…
Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…