Categories: Movie News

జగపతిబాబు కెరీర్ లో నంబర్ వన్..‘పెద్ది’ సినిమాలోని ‘అప్పలసూరి’ పాత్ర

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా..ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

‘ పెద్ది’ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్రలో వెర్సటైల్ స్టార్ జగపతి బాబు నటించారు.తాజాగా ఆ పాత్ర గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ రోల్ లో జగపతిబాబు కనిపించడని, అప్పలసూరి మాత్రమే కనిపిస్తారని చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుందని, ఆయన ఆ పాత్రను అలా ఉండాలని కోరుకున్నారని తెలిపారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ ని డిజైన్ చేశారని పేర్కొన్నారు. మొదటిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఆ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్ధమైందని వెల్లడించారు.

అంతేకాదు అప్పలసూరి పాత్ర తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు జగపతిబాబు తెలిపారు. ఎమోషనల్ గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ తనకు చాలా నచ్చిన పాత్రని పేర్కొన్నారు. లెజెంట్ తరువాత చాలా సినిమాలు చేశాను. కానీ వాటిలో గుర్తు పెట్టుకునేవి ఓ ఆరు ఉంటాయి. ఆ లిస్టులో పెద్దిలో చేసిన అప్పలసూరి పాత్ర నంబర్ వన్ స్థానంలో ఉంటుందని తెలిపారు.

ManaTV Team

Recent Posts

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…

2 days ago

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…

2 days ago

Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive

Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…

2 days ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

2 days ago

Meet & Greet With MP Chamala Kiran Kumar Reddy || MANA TV

ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…

2 days ago

IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv #telugumusic #manatv

IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv swaraVaibhavam #igga #manatv #manatvusa #telugucommunity #teluguevents #telugumusic #teluguculturalprograms #telugunri…

2 days ago