హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో సెమీ కండక్టర్ రంగంలో అవకాశాలను పరిశీలించేందుకు సింగపూర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. తొలి దశలో మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు సీఎం వివరించారు.
రివర్‌ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీ అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా నాలెడ్జ్, టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను కూడా సీఎం ప్రస్తావించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అలాగే భారత్ ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో సింగపూర్ అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో, బహుళ రంగాల అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాలను ఇప్పటికే వెల్లడించింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
సింగపూర్ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సింగపూర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్ జనరల్ విలియం చిక్తో పాటు పలువురు సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. మెహసానా జిల్లాలోని వద్‌నగర్ సమీపంలోని గుంజా…
సిక్కింలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’, ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో భాగంగా…
Atlanta: The Andhra Pradesh American Association (AAA) – Atlanta Chapter is organizing a 30-Day Free…
కర్మలో నైపుణ్యమే యోగం | భగవద్గీత శ్లోకం 50 | శ్రీకృష్ణుడి బోధ #karmayoga #manatv #bhagavadgita #geetha #krishna…
Sri Gayatri Pooja Stores | Beautiful Wooden Pooja Articles & Traditional Pooja Essentials #manatv #srigayatripoojastores…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 17-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…