అమెరికాలో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు బాల్టిమోర్ నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆటా కన్వీనర్ శ్రీధర్ బానాల పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాల్టిమోర్‌లో నివసిస్తున్న తాను, ఇంత అద్భుతమైన స్థాయిలో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక మహోత్సవాలను ఈ నగరం ఇప్పటివరకు చూడలేదని అన్నారు.
మహాసభల విజయానికి సహకరించిన ఆటా సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, అతిథులు, కళాకారులు, ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత కొన్ని నెలలుగా తనకు అండగా నిలిచి, అన్ని విధాలుగా సహకరించిన తన సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
వేలాది మంది తెలుగు ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించిన ఈ మహాసభలు ఉత్తర అమెరికాలోని తెలుగు సమాజ ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయని శ్రీధర్ బానాల పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆటా ఆధ్వర్యంలో మరిన్ని ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపజేస్తామని ఆయన వెల్లడించారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు బాల్టిమోర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి…
Mana American Telugu Association (MATA) Bonalu 2026 | Grand Telangana Festival in USA ManaTV Network…
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభలకు మేరీల్యాండ్…
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ,…
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర…
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు సినీ, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా జరిగాయి..…