Find Articles

నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్..ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్..ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో ఆయనకు షాక్ తగిలింది.బెంగళూరులోని 48వ ఏసీజేఎం (ACJM) కోర్టు ప్రకాశ్ రాజ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చింది.

ప్రకాశ్ రాజ్‌కు నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలో ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.ఈ అక్రమ ఓట్ల వ్యవహారంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

ఈ ప్రైవేట్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం పలుమార్లు స్వయంగా హాజరుకావాలంటూ ప్రకాశ్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది.కానీ, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాశ్ రాజ్ వరుసగా విచారణలకు గైర్హాజరవుతూ వచ్చారు. సమన్లను సైతం లైట్ తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం… ఈసారి ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో పోలీసులు ప్రకాశ్ రాజ్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ManaTV Team