Find Articles

మహేశ్ బాబు ‘వారణాసి’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

మహేశ్ బాబు ‘వారణాసి’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’కి సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారణాసి ఘాట్స్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశమని చెబుతున్న ఈ క్లిప్ నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియో అసలైనదేనా? లేక ఎడిట్ చేసినదా? అనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వైరల్ అవుతున్న వీడియోలో మహేశ్ బాబు రక్తసిక్తమైన రూపంలో కనిపిస్తున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఆగస్టు 8న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందనే అంచనాల మధ్య ఈ వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఒకవైపు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు సినిమా సెట్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి లీక్ కాదు. గతంలో కూడా సెట్స్ ఫొటోలు, కీలక పాత్రలకు సంబంధించిన చిత్రాలు, ఇతర షూటింగ్ వివరాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. దీంతో చిత్రబృందం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలంటూ అభిమానులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ‘వారణాసి’ మహేశ్ బాబు కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ManaTV Team