
తమిళనాడు సీఎం విజయ్‌కు నటి త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వారి స్నేహంపై సాగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. విజయ్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్న త్రిష, తమ అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో తెలియజేశారు.
జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా త్రిష నుంచి ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేశారనే టాక్ గట్టిగా వినిపించింది. వారి స్నేహబంధం దెబ్బతిన్నదంటూ సాగిన ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ, విజయ్‌తో ఉన్న ఒక ఫొటోను త్రిష సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు తమ బంధం ఎంతో విశిష్టమైనదనే అర్థం వచ్చేలా ఆమె ఒక భావోద్వేగపూరితమైన క్యాప్షన్‌ను దీనికి జతచేశారు.
విజయ్ బర్త్ డే సందర్భంగా కట్ చేసిన కేక్ ఫోటోను షేర్ చేసిన త్రిష. “అన్నింటికీ విలువనిచ్చే వ్యక్తికి.. HBD 00.00” అని క్యాప్షన్ ఇచ్చారు. తన క్యాప్షన్‌లో ‘00.00’ అని పేర్కొనడం ద్వారా, జూన్ 22న అర్ధరాత్రి 12 గంటలకే తాను విజయ్‌కు విషెస్ చెప్పినట్లు త్రిష ఇన్ డైరెక్ట్ గా తెలిపారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం విజయ్‌కు త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని, సోషల్ మీడియాలో ఆయనను అన్‌ఫాలో చేశారని వచ్చిన వార్తలన్నింటికీ ఈ పోస్ట్‌తో ఆమె సమాధానమిచ్చినట్లు అయింది.

