Find Articles

భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌.. సమయాల్లో కీలక మార్పులు

భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌.. సమయాల్లో కీలక మార్పులు

భారత్, ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల సమయంలో కీలక మార్పు చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు ఇప్పుడు సాయంత్రం 6 గంటలకే మొదలుకానున్నాయి. జూన్ 28న జరిగే రెండో టీ20 మ్యాచ్, మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ సమయం కలిసిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జూన్ 26, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, ఐర్లాండ్ జట్టుకు లోర్కన్ టక్కర్ నాయకత్వం వహించనున్నారు. అయితే, క్రికెట్ ఐర్లాండ్, భారత ప్రసార భాగస్వాములు చర్చలు నిర్వహించిన తరువాత మ్యాచ్ సమయాల్లో మార్పు చేశారు.

ManaTV Team