Find Articles

ప్రియదర్శితో సుకుమార్ సినిమా.. టైటిల్ పోస్టర్ లాంచ్

ప్రియదర్శితో సుకుమార్ సినిమా.. టైటిల్ పోస్టర్ లాంచ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2’ తరువాత ఇంతవరకూ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. రామ్ చరణ్ హీరోగా సుక్కు ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అయితే ఈ గ్యాప్ లో సుకుమార్ తన నిర్మాణంలో సరికొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ‘ ఇడుపు కాయితం ’ అనే సినిమాని ప్రకటించారు.

ప్రియదర్శి హీరోగా బీవీ వర్క్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్ పై ‘ఇడుపు కాయితం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జానపద గాయని నాగ దుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను సుకుమార్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టైటిల్ అండ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. అల్లు అరవింద్, దిల్ రాజుతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ManaTV Team