Find Articles

అమెరికాలో ఘనంగా దేవీపురం శ్రీ విద్య టీచింగ్ టూర్ – న్యూజెర్సీలో శాస్త్రోక్తంగా శ్రీ జ్యోతి పూజ

అమెరికాలో ఘనంగా దేవీపురం శ్రీ విద్య టీచింగ్ టూర్ – న్యూజెర్సీలో శాస్త్రోక్తంగా శ్రీ జ్యోతి పూజ

విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ దేవీపురం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీ విద్య టీచింగ్ టూర్ – యూఎస్ఏ టూర్ 2026” ఆధ్యాత్మిక కార్యక్రమం అమెరికాలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ విద్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక శిక్షణా యాత్ర కొనసాగుతోంది. అన్నపూర్ణాంబ ,  అమృతానంద నాథ సరస్వతి  ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, వారి కుమార్తెలు  రాధా మార్తి మరియు  రమా కందర్ప అమెరికాలోని పలు నగరాల్లో శ్రీ విద్యకు సంబంధించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా శ్రీ విద్య ప్రాథమిక అంశాలపై ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాలతో పాటు కలావాహన, హోమాలు, పంచాక్షరి ఉపాసన, శ్రీ జ్యోతి పూజ, మాత్రికా న్యాస వంటి అనుభవాత్మక సాధన సెషన్లు భక్తులకు అందిస్తున్నారు. ఇటీవల న్యూజెర్సీలోని సాయిబాబా టెంపుల్‌లో శ్రీ జ్యోతి పూజను శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ విద్య సాధనపై అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను విదేశాల్లోని యువతకు చేరువ చేయడంలో దేవీపురం సంస్థ చేస్తున్న కృషిని పాల్గొన్న భక్తులు ప్రశంసించారు. అమెరికాలోని మరిన్ని నగరాల్లో కూడా ఈ శ్రీ విద్య టీచింగ్ టూర్ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

ManaTV Team