Find Articles

సర్కస్ లా మారిన అంత్యక్రియలు.. రాధికా శరత్ కుమార్ ఆవేదన

సర్కస్ లా మారిన అంత్యక్రియలు.. రాధికా శరత్ కుమార్ ఆవేదన

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ అంత్యక్రియల సందర్భంగా ఎదురైన పరిస్థితులపై నటి రాధికా శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్పోయిన మనవారిని చివరిసారి చూసే క్షణాలు జీవితంలో ఎంతో భావోద్వేగంగా ఉంటాయి. అలాంటి సమయంలో ప్రశాంత వాతావరణం ఉండాల్సిందిపోయి గందరగోళం నెలకొనడం బాధాకరమని వాపోయారు.

భాగ్యరాజ్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన వారి రద్దీతో అంత్యక్రియల వాతావరణం మారిపోయింది. దీంతో రాధికా శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల ప్రదేశం సర్కస్ లా మారిపోయిందన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి ఎప్పుడు వచ్చిందో అర్థం కావడం లేదన్న ఆమె, కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాధను పంచుకునే సమయంలో వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. అంత్యక్రియల సమయంలో జనసమూహం, మీడియా నిర్వహణకు స్పష్టమైన ప్రొటోకాల్ రూపొందించాలని సూచించారు.

భాగ్యరాజ్ మృతిపై రాధిక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. 50 ఏళ్ల ప్రత్యేక స్నేహానికి ఇదే చివరి వీడ్కోలు అని చెప్పారు. భాగ్యరాజ్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.

ManaTV Team