
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’ (కళా ప్రదర్శన) నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అమెరికా 250 సంవత్సరాల స్వాతంత్ర్య ప్రయాణాన్ని, అలాగే టామా (TAMA) 45 వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఒకే వేదికపై గౌరవిస్తూ… “USA 250 Years | TAMA 45 Years” అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ప్రదర్శన జరగనుంది.
మీరు వృత్తిపరమైన కళాకారులైనా, హాబీగా చిత్రాలు గీసేవారైనా, విద్యార్థులైనా లేదా కళను అమితంగా ప్రేమించేవారైనా… మీ సృజనాత్మకతను చాటుకోవడానికి ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశం! అమెరికా చారిత్రక ప్రయాణాన్ని, తెలుగు సంస్కృతిని మీ కళాఖండాల ద్వారా ప్రతిబింబించేందుకు అందరికీ ఇదే మా ఆహ్వానం.
కార్యక్రమ వివరాలు:
తేదీ: శనివారం, జూలై 25
సమయం: సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు
వేదిక: 160 మార్టిన్ డ్రైవ్, ఆల్ఫారెట్టా, GA (160 Martin Drive, Alpharetta, GA)

