Find Articles

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘బెంగాల్ టైగర్’ సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ చిత్రంలో గంగూలీ పాత్రను జాతీయ అవార్డు గ్రహీత రాజ్ కుమార్ రావు పోషిస్తున్నారు. ఈ సందర్భంలోనే రాజ్ కుమార్ రావు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో 2002లో లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పుతూ సంబరాలు చేసుకున్న చారిత్రాత్మక దృశ్యాన్ని రాజ్ కుమార్ రావు రీ క్రియేట్ చేశారు. ఆయన వెనుక భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. అలాగే పోస్టర్‌పై ఉన్న “ఆయన ఆట ఆడటమే కాదు.. ఆటనే మార్చేశాడు” అనే ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది.

‘దాదా’ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గంగూలీ భార్య డోనా గంగూలీ పాత్రలో తాన్యా మానిక్తాలా నటిస్తుండగా.. ఈ సినిమా వచ్చే ఏడాది మే 14న విడుదల కానుంది. భారత క్రికెట్‌కు మహారాజుగా పేరుగాంచిన గంగూలీ, తన కెప్టెన్సీలో జట్టును 2003 ప్రపంచకప్ ఫైనల్ వరకు నడిపించారు. వన్డేల్లో 11,363 పరుగులు చేసిన ఆయన, 2004లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2012లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

ManaTV Team