Find Articles

భారత్‌లో టెక్ ఉద్యోగాలకు మళ్లీ జోష్.. 1.23 లక్షల అవకాశాలు

భారత్‌లో టెక్ ఉద్యోగాలకు మళ్లీ జోష్.. 1.23 లక్షల అవకాశాలు

దేశంలో టెక్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా 1.23 లక్షల టెక్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు ‘ఎక్స్‌ఫెనో’ నివేదిక వెల్లడించింది. గత 18 నెలల్లో ఇదే అత్యధిక ఉద్యోగ నియామకాలని పేర్కొంది.

సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్‌లో టెక్‌ ఉద్యోగాల సంఖ్య 5 శాతం పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదైంది.

అయితే ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం అనుభవజ్ఞులకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 68 వేల పోస్టులు మిడ్‌ నుంచి సీనియర్‌ లెవల్‌ అభ్యర్థుల కోసం ఉండగా.. ఫ్రెషర్లకు కేవలం 15 వేల అవకాశాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.

నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 31 వేల, హైదరాబాద్‌లో 14 వేల, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 9 వేల టెక్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక పని విధానంలోనూ ఆఫీస్‌ ఆధారిత ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం టెక్‌ ఉద్యోగాల్లో 81 శాతం ఆఫీస్‌ వర్క్‌కు సంబంధించినవేనని తెలిపింది.

ManaTV Team