అమెరికన్ తెలుగు సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వేడుకల్లో గ్లామరస్ యాక్ట్రెస్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి వడ్త్యా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న ప్రసిద్ధ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ మహాసభలు జరగనున్నాయి.
తన నటనతో, ఛార్మింగ్ లుక్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న దివి, ఈ అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షంగా అలరించబోతుండటంతో అమెరికాలోని ప్రవాస తెలుగువారితో పాటు ముఖ్యంగా యూత్ వర్గాల్లో నెవర్ బిఫోర్ అనే విధంగా క్రేజ్ ఏర్పడింది. ఈ మూడు రోజుల సంబరాల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, యూత్ కన్వెన్షన్ వేడుకల్లో దివి పాల్గొని ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు.
ప్రవాసాంధ్రుల ఐక్యతను చాటేలా, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్లాన్ చేసిన ఈ 19వ మహాసభలకు దివి రాక ప్రధాన హైలైట్‌గా మారనుంది. గ్లామర్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో మార్మోగనున్న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో దివి సందడి ఈ వేడుకల జోష్‌ను రెట్టింపు చేయడమే కాకుండా, ఎన్ఆర్ఐలకు ఓ మరుపురాని అనుభూతిని అందించబోతోందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.