ప్రముఖ ఇన్వెస్టర్, రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలక హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులు, ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న విధానాల కారణంగా భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణం పెరుగుదలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకునేందుకు బంగారం, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై దృష్టి సారించాలని సూచించారు.
2002లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే ప్రమాదాలను తాను అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం సంపాదనపై కాకుండా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని తెలిపారు.
ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం, పెట్టుబడులపై సరైన జ్ఞానం సంపాదించుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోగలరని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు.