భారత సముద్ర జలాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన కోస్టల్ గార్డ్ నౌక ఐసీజీఎస్ సావిత్రిబాయి ఫూలే సేవల నుంచి రిటైర్ అయింది. కర్ణాటకలోని కార్వార్ పోర్టులో నౌక డీ-కమిషనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
2006లో భారత కోస్టల్ గార్డ్‌లో సేవల్లోకి వచ్చిన ఈ నౌక.. తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక కీలక ఆపరేషన్లలో పాల్గొంది. ఇప్పటివరకు 14 సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, 4 మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్లు చేపట్టింది.
సముద్రంలో ప్రమాదాలకు గురైన మత్స్యకారులు, వాణిజ్య నౌకల సిబ్బందిని రక్షించడంలో ఐసీజీఎస్ సావిత్రిబాయి ఫూలే కీలక పాత్ర పోషించింది. సముద్ర భద్రత, రక్షణ చర్యల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ నౌకకు డీ-కమిషనింగ్ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు.