నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
‘శికంజ మాలిక్’ అనే శక్తివంతమైన పాత్రలో ఆయన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అణచివేతకు ప్రతీకగా కనిపించే ఈ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మోహన్‌బాబు పేర్కొన్నారు.
1984–85 కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ తెలుగు సినీ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.