శిశు ఆధార్ కార్డు’ కలిగిన 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని UIDAI వెల్లడించింది.
ఈ నెల 30వ తేదీ వరకు సమీపంలోని ఆధార్ కేంద్రాల్లో ఈ సేవను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.125 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పాఠశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడం ముఖ్యమని UIDAI సూచించింది.
తల్లిదండ్రులు గడువు లోపు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు.