Find Articles

రష్యా చమురుపై భారత్‌కు కఠిన చర్యలు వద్దు.. అమెరికాకు జేమీ డైమన్ సూచన

రష్యా చమురుపై భారత్‌కు కఠిన చర్యలు వద్దు.. అమెరికాకు జేమీ డైమన్ సూచన

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షాత్మక టారిఫ్‌లు విధించే ముందు అమెరికా ప్రభుత్వం పునరాలోచించాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు.

భారత్‌పై ఆంక్షలు విధిస్తే.. భారత్‌కే కాకుండా ప్రపంచ చమురు మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయి? వాటి అవసరాలు ఏమిటి? అనే అంశాలను ముందుగా అర్థం చేసుకోవాలని డైమన్ సూచించారు.

అమెరికా ప్రభుత్వం భారత్‌తో చర్చలు జరిపి, వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ManaTV Team