ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని ప్రసాదించారని పేర్కొన్నారు.
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున.. తాను 25 ఏళ్ల పాటు నిరంతరంగా ప్రజాసేవలో ఉంటానని ఊహించలేదని మోదీ గుర్తుచేసుకున్నారు.
తనకు అండగా నిలుస్తూ, ఇంతగా ఆదరిస్తున్న దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలే తన సేవా ప్రయాణానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.