Find Articles

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త రికార్డు.. 10 లక్షల పెయిడ్ మెంబర్స్

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త రికార్డు.. 10 లక్షల పెయిడ్ మెంబర్స్

ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 10 లక్షల మంది పెయిడ్ మెంబర్స్‌ను సంపాదించి ఈ ఘనత సాధించిన తొలి యూట్యూబర్‌గా నిలిచారు. ఈ రికార్డును యూట్యూబ్ సంస్థ అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం.

తొలుత చెస్‌కు సంబంధించిన వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయ్ రైనా.. ఆ తర్వాత ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు.

గతేడాది ఈ షో చుట్టూ వివాదాలు చెలరేగడంతో కొంతకాలం విరామం తీసుకున్న ఆయన.. ఈ ఏడాది మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా 10 లక్షల మంది పెయిడ్ మెంబర్స్‌తో అరుదైన రికార్డు సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు.

ManaTV Team