ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న NATS, ఈ కార్యక్రమం ద్వారా మిషిగన్ ప్రాంతంలో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనుంది.
ఈ కార్యక్రమం మిషిగన్‌లోని ఫార్మింగ్టన్ హిల్స్‌లో ఉన్న ఫార్మింగ్టన్ హిల్స్ మేనర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనుంది.
ఈ కార్యక్రమానికి NATS చైర్మన్ కిషోర్ కంచర్ల, NATS అధ్యక్షుడు రాజ్ అల్లాడ నాయకత్వం వహించనున్నారు.
మిషిగన్ చాప్టర్ సమన్వయకర్తగా శ్రీదేవి మానేపల్లి, జాయింట్ కోఆర్డినేటర్‌గా మాహి బొల్లవరం, ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్స్ బాధ్యతల్లో రవి చలంటి, కోశాధికారిగా హేమ సూరపరాజు వ్యవహరిస్తున్నారు. సభ్యత్వ విభాగంలో జ్యోతి జవ్వాది, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగంలో అనుపమ దివాకర్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు:
- తేదీ: అక్టోబర్ 11, 2026
- సమయం: ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు (EST)
- వేదిక: ఫార్మింగ్టన్ హిల్స్ మేనర్, 23666 ఆర్చర్డ్ లేక్ రోడ్, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్ – 48337
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
- శ్రీదేవి మానేపల్లి: 734-277-6096
- మాహి బొల్లవరం: 248-497-1845
NATS హెల్ప్‌లైన్: +1-888-4-TELUGU
వెబ్సైట్: www.sambaralu.org