ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ ధ్రువీకరించినప్పటికీ, ఆయన రాజీనామాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
2017లో ఫ్లిప్కార్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కల్యాణ్ కృష్ణమూర్తి.. 2018 నుంచి గ్రూప్ సీఈఓగా కొనసాగుతున్నారు. దాదాపు పదేళ్ల పాటు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ఫ్లిప్కార్ట్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
మరోవైపు సంస్థ భవిష్యత్తుకు సంబంధించి పలు సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్లిప్కార్ట్ ఐపీఓపై నెలకొన్న అనిశ్చితి, కీలక ఉద్యోగుల నిష్క్రమణ, క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీ వంటి అంశాలు సంస్థకు సవాళ్లుగా మారాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా ఈ-కామర్స్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.