Find Articles

గ్రేటర్ బోస్టన్‌లో ఘనంగా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026

గ్రేటర్ బోస్టన్‌లో ఘనంగా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026

అమెరికాలోని గ్రేటర్ బోస్టన్‌లో మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అత్యుత్తమంగా నిలిచిన పది బతుకమ్మలకు నిర్వాహకులు చీరలను బహుమతులుగా అందజేశారు. చిన్నారుల్లో కళాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కళా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ఉచిత ప్రవేశం, భోజన సదుపాయాలతో నిర్వహించిన ఈ వేడుకలు కుటుంబ సభ్యులు, చిన్నారులు, పెద్దలతో కళకళలాడాయి. ప్రవాస తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని అమెరికాలో చాటిచెప్పడంతో పాటు, ప్రవాస తెలుగు ప్రజల మధ్య సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేసేలా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 సాగాయి.

ManaTV Team