అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చాప్టర్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అక్టోబర్ 18, 2026న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వర్జీనియాలోని అష్బర్న్లో ఉన్న ఇండిపెండెన్స్ హైస్కూల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో పాటు దసరా సంబరాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, కుటుంబ సభ్యులు పాల్గొని పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. హాజరయ్యే వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. ఈవెంట్లో పాల్గొనాలనుకునే వారు, అలాగే వెండర్ రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వారు నిర్వాహకులు అందించిన వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
కార్యక్రమ వివరాలు: