Find Articles

న్యూయార్క్‌లో తొలిసారిగా TTA 2025–26 బోర్డు సమావేశం

న్యూయార్క్‌లో తొలిసారిగా TTA 2025–26 బోర్డు సమావేశం

న్యూయార్క్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) 2025–26 సంవత్సరానికి సంబంధించిన బోర్డు సమావేశాన్ని తొలిసారిగా న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్ వేదికగా ఘనంగా నిర్వహించింది.

ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, అధ్యక్షుడిగా ఎన్నికైన సహోదర్ పెద్ది రెడ్డి, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లాతో పాటు పలువురు బోర్డు సభ్యులు, సంస్థ నాయకులు హాజరయ్యారు.

2025–26 బోర్డు పదవీకాలానికి ముగింపు సమావేశంగా నిర్వహించిన ఈ భేటీలో అసోసియేషన్ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, భావితరాలకు వాటిని చేరవేయడం లక్ష్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ఈ సమావేశం ద్వారా సంస్థ కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ManaTV Team