మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. అయితే జూన్ 22న హఠాత్తుగా ఈ మూవీ సెట్స్ లో రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి చిరుని సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఫాదర్స్ డే సందర్భంగా ఓ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ సినిమా షూటింగ్ సెట్స్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడెన్‌గా వచ్చి, సర్‌ప్రైజ్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. అటు చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య సాగిన ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ వార్మింగ్ సంభాషణ ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది.
ఈ ప్రత్యేక క్షణాలను డైరెక్టర్ బాబీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “మెగా 158 సెట్స్‌లో అందమైన ఫాదర్స్ డే మూమెంట్‌ను చూడడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ సెట్స్‌కు వచ్చి తన తండ్రితో సమయం గడిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా కుటుంబంపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు” అని ఆయన రాసుకొచ్చారు. అయితే, ఈ పోస్టులో చిరు, చరణ్ ఫొటోలు పోస్టు చేయాలి. కానీ బాబీ మాత్రం కేవలం రామ్ చరణ్‌తో తాను దిగిన ఫొటోలను మాత్రమే షేర్ చేశారు. దీంతో చిరంజీవి కొత్త లుక్‌ను గోప్యంగా ఉంచేందుకే చిత్రబృందం ఇలా చేస్తోందనే చర్చ జోరందుకుంది.
గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో మళ్లీ అదే క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి మరోసారి తనదైన స్టైల్, ఎనర్జీతో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…
Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…