మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బరి’పై అభిమానులను ఉత్సాహపరిచే మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలతో కలిసి నటించిన నాగబాబు, తొలిసారిగా తన కుమారుడు వరుణ్ తేజ్‌తో పూర్తి స్థాయి కాంబినేషన్ సన్నివేశాల్లో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ వెల్లడించడం విశేషం.
గతంలో వచ్చిన ‘హ్యాండ్స్ అప్’ చిత్రంలో వరుణ్ తేజ్ చిన్ననాటి పాత్రలో నటించినప్పటికీ, తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్లు లేవు. అయితే ‘బరి’ చిత్రంలో వీరిద్దరి మధ్య కథకు కీలకమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రాన్ని నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా, ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ సభ్యులే కలిసి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటీవల కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే ‘బరి’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. కథ, నటీనటుల ఎంపిక, కుటుంబ అనుబంధం వంటి అంశాలతో ఈ సినిమా మెగా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రీకొడుకులు తొలిసారి పూర్తి స్థాయిలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…