‘కలర్స్’ స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని ఆమె వివాహం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా ఫొటోలతో పంచుకున్న ఈ జంట పెళ్లిని అధికారికంగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో స్వాతి దంపతులకు ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో 2023లో విడుదలైన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో స్వాతి కథానాయికగా నటించారు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన ఈ చిత్రం, ముఖ్యంగా ఓటీటీ వేదికగా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, వైవాహిక బంధానికి దారితీసిందని తెలుస్తోంది.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…