అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి. మాధవి కొల్లికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్లు హాజరై ఆమెను ఆత్మీయంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా శ్రీమతి. మాధవి కొల్లి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సమయంలోని తన అనుభవాలను పంచుకున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేసిన విధానాన్ని వివరించారు. గత ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు, మార్పు కోసం బీజేపీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. బీజేపీ విజయానికి ప్రధానమంత్రి మోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకం, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్కృషి ప్రధాన కారణాలని తెలిపారు. అదే తరహాలోనే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనపై నిరాశ చెందారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడారు. తెలంగాణలో వచ్చే దక్షిణ భారత బీజేపీ ప్రభుత్వం ఏర్పడే రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, 2028లో ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌కు అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన అనుబంధం కలిగిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్ తెలిపారు.
అనంతరం మాధవి కొల్లి గారి అమెరికా పర్యటన విశేషాలను ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల వివరించారు. బీజేపీ సంవత్సరాలుగా ఎలా బలోపేతం అయిందో తెలియజేయడంతో పాటు, 2028లో తెలంగాణలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సంతోష్ రెడ్డి, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, కృష్ణ మోహన్, ప్రసాద్, రాంరెడ్డి వేముల, రాజవర్ధన్ సహా పలువురు ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…