Categories: Movie News

‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. మూవీ ఫస్ట్ వీక్ టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. టికెట్ల ధరల విషయంలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 6 వ తేదీకి వాయిదా వేసింది.

‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలవుతుండగా, విచారణ జూన్ 6 కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన చిత్ర నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో ‘పెద్ది’ సినిమాకు ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం పాత ధరలే ఉన్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

 

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

7 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

7 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

8 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

9 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

9 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

12 hours ago