ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ రాకా ’. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కాస్టింగ్ గురించి డైరెక్టర్ అట్లీ షేర్ చేసుకున్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాకా సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ తెలిపారు.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ఛాన్స్ ను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ప్రీతి ముకుందన్ చేయాల్సిన ఆ పవర్‌ఫుల్ పాత్రను ఆ తర్వాత నటి ఫెమినా జార్జ్‌కి అప్పగించినట్లు తెలిపారు.కాగా ‘రాకా’ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా సన్నాహాలు జరుపుకుంటోంది.
తెలుగులో ‘ఓం భీమ్ బుష్’, ‘కన్నప్ప’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతీ ముకుందన్ ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం రూ. 18 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో అర్జున్ సర్జా, అభిరామి వంటి సీనియర్ నటులతో కలిసి నటించిన ప్రీతి, తన మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమా అందించిన భారీ విజయంతో ఆమెకు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…