టాలీవుడ్ నటులు ప్రకాశ్ రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మొదలైన ట్వీట్ వార్ కొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ యుద్ధంలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.విషయం ఏదైనా సరే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ, వివాదాలు కొనితెచ్చుకుంటారు.మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి గతంలో ఆయన పెట్టిన పోస్టులు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. అయితే గత కొంతకాలంగా వివాదాస్పద అంశాలకు దూరంగా ఉన్న ఆర్జీవీ.. తాజాగా ప్రకాష్ రాజ్ పోస్టుపై స్పందించి హాట్ టాపిక్ గా నిలిచారు.
నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల పెట్టిన పోస్టుపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. నాయకుడి మాటే శాసనం..ఆయన్ను ప్రశ్నించవద్దు.. గుడ్డిగా ఫాలో అయిపోండంటూ పవన్ కల్యాణ్ ఫోటోతో పెట్టిన ట్వీట్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘ మేము గొర్రెలం కాదు. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు.. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడికైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అని తన పోస్టులో రాసుకొచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు.
‘‘ ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మిన ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు. అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదు అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆర్జీవీ చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయంపై పోస్టు పెట్టడం చర్చకు దారితీసింది.ఈ సందర్భంలోనే ఆర్జీవీ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…