Categories: Movie News

ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టా.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా నటి అంజలి

స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆమె తమిళ చిత్రం ‘ మగుడం’ తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అంజలి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఓ అబ్బాయికి రాఖీ కట్టి అన్నయ్యను చేసుకోబోయినట్లు చెప్పారు అంజలి. కానీ అతను వెంటనే దాన్ని తీసి తనకే తిరిగిచ్చాడని తన స్కూల్ నాటి ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలపై వస్తున్న పుకార్లతో విసిగిపోయానని చెప్పారు. ప్రస్తుతం తన తమిళ చిత్రం ‘మగుడం’ (తెలుగులో మకుటం) ప్రమోషన్లలో బిజీగా ఉన్నట్లు తెలిపారు.

కొంతకాలంగా పలువురు యాక్టర్స్ తో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై అంజలి స్పందించారు. ఈ పుకార్లు తనను చాలా బాధించాయన్నారు. నేను ఒకరి పేరు చెబితే, మీరు మరొకరి గురించి అడుగుతారు. అందుకే ఎవరి పేరు చెప్పదల్చుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అంజలి ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.

ManaTV Team

Recent Posts

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

5 hours ago

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

19 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

20 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

22 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

23 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

1 day ago