టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీలక షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వెంకటేశ్ తాజాగా సెట్స్‌లో అడుగుపెట్టారు.
ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఎపిసోడ్లలో వెంకటేశ్‌తో పాటు నందమూరి కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. ఇటీవల కల్యాణ్‌రామ్ పుట్టినరోజును చిత్రబృందం సెట్స్‌లోనే జరుపుకున్న సంగతి తెలిసిందే.ఆ సందర్భంగానే సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుందని ప్రకటించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఇక వెంకటేశ్‌తో అనిల్ రావిపూడికి ఇది ఐదో సినిమా కావడం విశేషం.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి సినిమాలు రాగా.. మరోసారి ఇద్దరూ చేతులు కలిపారు.అలాగే కల్యాణ్‌రామ్‌తో అనిల్‌కు ఇది రెండో చిత్రం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పటాస్’ మంచి విజయం సాధించింది.ప్రస్తుతం మల్టీస్టారర్ గా వస్తున్న ఈ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ వినోద కథగా రాబోతుందని సమాచారం.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…
Tirupati Balaji Latest Information | Tirumala Update తిరుమల సమాచారం#tirumala #ttd#balaji#manatvlive #tirumala #ttd #tirupati #tirupatibalaji #srivari…
#harishrao #congress #telangana #telanganapolitics #brs #politics #breakingnews #latestnews #manatvlive #telugunewsWatch Mana TV Anytime, Anywhere! Mana…