Categories: Movie News

భారీ యాక్షన్ సీక్వెన్స్.. క్లైమాక్స్ కు శర్వానంద్ ‘భోగి’ షూటింగ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లోనే దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ సీన్స్ భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ తో ఉండనున్నాయని సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

1960ల కాలంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని కల్పిత గ్రామం నేపథ్యంలో ‘భోగి’ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గంగ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ నటిస్తుండగా, డింపుల్ హయాతి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28న రాఖీ పండుగ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

7 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

8 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

8 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

9 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

9 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

12 hours ago